మీరంటే క్రష్ అని హీరోకి డైరెక్ట్‌గా చెప్పిన యాంకర్.. కానీ అదే ప్రాబ్లం అంటూ !!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన శైలిలో విభిన్న పాత్రలలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజు వారు రాణిగారు సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గానే 'క ', కే ర్యాంప్ చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్నాడు.
కాగా కిరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'చెన్నై లవ్ స్టోరీ'. ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిస్తుండగా.. బేబీ, కలర్ ఫోటో ఫేమ్ సాయి రాజేష్ కథ అందించారు. రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్‌కేఎన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మేరకు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీం పలువురు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా యాంకర్ కిరణ్ పై తనకు ఒకప్పుడు క్రష్ ఉందని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ ఆమె ఎవరంటే..?
మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి "మౌనీషా చౌదరి" తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఆమె చెన్నై లవ్ స్టోరీ టీంతో జరిగిన ఇంటర్వ్యూకు యాంకర్ గా వ్యవహరించారు. ఈ మేరకు అందులో మాట్లాడుతూ.. ఒకప్పుడు మీరంటే నాకు క్రష్ ఉండేది అంటూ కిరణ్ తో చెప్పింది. దీంతో హీరో కిరణ్ అబ్బవరం వెంటనే "ఒకప్పుడు అంటే... ఇప్పుడు లేదా?" అంటూ పంచ్ వేశారు. ఆ వెంటనే యాంకర్ కూడా మాట్లాడుతూ.. ఇప్పుడు మీకు పెళ్లైపోయింది... నాకు కూడా పెళ్లైపోయింది. అంటూ సరదాగా చెప్పుకొచ్చింది.
ఇక మౌనీషా చౌదరి గురించి చెప్పాలంటే.. మౌనిషా.. యాంకర్, కంటెంట్ క్రియేటర్, నటి కూడా. హైదరాబాద్‌లో జన్మించిన ఆమె దాదాపు 10 సంవత్సరాల క్రితమే అమెరికాలో ఉన్నారు. సోషల్ మీడియాలో 'స్నో అక్క'గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలానే కిరణ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తనతో కలిసి నటించిన హీరోయిన్ రహస్య గోరక్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. రీసెంట్ గానే ఈ జంట తల్లిదండ్రులు అయ్యారు.
Here’s a fun glimpse of Team #ChennaiLoveStory Chit Chat with Snow Akka ❤️https://t.co/oPMRvZtLgu
— ANANTAPUR CINEMA (@AnantapurCinema) July 13, 2026
Watch the Full Interview Today at 6:00 PM ✨
In cinemas worldwide on July 24. ✨#KiranAbbavaram #SriGouriPriya #Manisharma #SKN#ChennaiLoveStoryOnJuly24pic.twitter.com/6JB16eh72B












Click it and Unblock the Notifications