క్రికెట్ ముసుగులో డ్రగ్స్ మాఫియా: షోయబ్ అక్తర్, ఆసిఫ్‌ల వెనుక ISI హస్తం?
భారత హోంమంత్రిత్వ శాఖ మాజీ అండర్ సెక్రటరీ ఆర్వీఎస్ మణి.. పాకిస్తానీ క్రికెట్ ఆటగాళ్లు, ప్రతినిధి బృందానికి సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తానీ క్రికెటర్లు, ప్రతినిధి బృంద సభ్యులతో పాటు పాక్ మాజీ పేసర్లు షోయబ్ అక్తర్, మహమ్మద్ ఆసిఫ్ వంటి ఆటగాళ్లు భారత పర్యటనకు వచ్చినప్పుడల్లా తమతో పాటు డ్రగ్స్ తీసుకువచ్చేవారని ఆయన ఆరోపించారు. 2006-2007 కాలంలో భారత పర్యటనకు వచ్చినప్పుడు పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహమ్మద్ ఆసిఫ్ ఐఎస్ఐ(ISI) కనుసన్నల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ కు పాల్పడేవారని ఆయన తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించిన కీలక విషయాలు ఇప్పుడు క్రీడా, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఆ కాలంలో 2006 నుంచి 2010 వరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని అంతర్గత భద్రతా విభాగంలో అండర్ సెక్రటరీగా పనిచేసిన ఆర్వీఎస్ మణి తన అనుభవాలను పంచుకుంటూ.. భారత పర్యటనకు వచ్చే ప్రతి పాకిస్థాన్ డెలిగేషన్ లేదా క్రికెట్ జట్టు డ్రగ్స్ రవాణా చేసేవని ఆయన పేర్కొన్నారు. క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహమ్మద్ ఆసిఫ్ తాము మాదకద్రవ్యాలను తీసుకువచ్చినట్లు పాకిస్తానీ హైకమిషనర్ ఎదుట అంగీకరించినట్లు ఒక నివేదిక ఉందని.. ఆ తర్వాత వారిని వెనక్కి పంపించారని ఆయన వెల్లడించారు. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ వారి వ్యక్తిగత అవసరాల కోసం కాదని.. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం కోసమేనని ఆర్వీఎస్ మణి ఆరోపించారు. ఇది అక్టోబర్ 16న జరిగిందన్నారు. అది జరిగిన ఆరు నెలల తర్వాత మార్చిలో పాకిస్తానీయుల మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న పాకిస్తాన్ జట్టు ఇంగ్లీష్ కోచ్ బాబ్ వూల్మర్ అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురయ్యారని ఆయన చెప్పారు.

బాబ్ వూల్మర్ మార్చి 18, 2007న మరణించారని.. ఆ సమయంలో ఆయన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉన్నారన్నారు. 2007 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా జమైకాలోని కింగ్‌స్టన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయిన మరుసటి రోజు ఆయన తన హోటల్ గదిలో అపస్మారక స్థితిలో కనిపించారని.. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన చనిపోయారని వెల్లడించారు ఈ ఘటనలన్నింటికీ పరస్పర సంబంధం ఉందని.. భారత్ కు డ్రగ్స్ సరఫరా చేయడం అనేది పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక విధానంలో ఓ భాగమని ఆరోపించారు. భారతదేశంలో జరిగిన 30 శాతం ఉగ్రవాద దాడులకు మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారానే నిధులు సమకూరాయని ఆయన వెల్లడించారు.
#WATCH | During podcast interview to ANI, Former Under Secretary, MHA, RVS Mani said, "There is a reported case of cricketers Shoaib Akhtar and Mohammad Asif, where they were sent back (from India) by the Pakistani High Commission after their confession that they were carrying… pic.twitter.com/SbdjiUhA8r
— ANI (@ANI) July 14, 2026
జలాలాబాద్‌లో నల్లమందు పంట బాగా పడితే...
హోం మంత్రిత్వ శాఖలోని చర్చలను గుర్తుచేసుకుంటూ, ఆర్వీఎస్ మణి ఇలా అన్నారు. "అందుకే ఆఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌లో నల్లమందు పంట బాగా పండుతే భారతదేశంలో మరిన్ని ఉగ్రవాద దాడులు జరుగుతాయని హోంశాఖలో మేము అంచనా వేసేవాళ్లమని ఆయన పేర్కొన్నారు. 'ఈసారి జలాలాబాద్‌లో నల్లమందు మరీ ఎక్కువగా పండించారో లేదో చూడండి, లేకపోతే అది మాకు తలనొప్పి అవుతుంది' అని మేము ఈ విధంగా అంచనా వేసేవాళ్లమన్నారు.
డ్రగ్స్ అక్రమ రవాణా కోసం పాకిస్తాన్ ఇంతటి ఉన్నత స్థాయి వ్యక్తులను ఉపయోగించుకోగలదా అని పాడ్‌కాస్ట్‌లో అడిగినప్పుడు ఆయన ఇలా అన్నారు, "మహ్మద్ ఆసిఫ్, షోయబ్ అక్తర్ ఉన్నత స్థాయి వ్యక్తులు. వారిలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు. బహుశా వారి పేర్లు బయటకు రాకపోవచ్చు, కానీ ఇందులో ఒక పూర్తి బృందం పాలుపంచుకుని ఉండేది. వారు ఈ పని చేసేవారు." అని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్‌తో ప్రజల మధ్య సంబంధాలే అతిపెద్ద మోసం అని, ఎందుకంటే ఈ విషయాలన్నీ అక్కడే జరిగేవని ఆయన అన్నారు.ఈ వ్యక్తులను ఐబీ ట్రాక్ చేయలేదా అని ప్రశ్నించగా.. ఆర్వీఎస్ మణి మాట్లాడుతూ అనేక నివేదికలు, కదలికల నివేదికలు హోం మంత్రిత్వ శాఖలో ఉన్నాయని, ఎందుకంటే మనల్ని అప్రమత్తం చేయడం, సమాచారం ఇవ్వడమే ఐబీ పని అని, తదుపరి పని ఇతర శాఖలదని అన్నారు. ఇదంతా మీకు తెలిసి ఉన్నప్పటికీ చూసినప్పుడు ఎలా అనిపించిందని ఆర్వీఎస్ మణిని అడగ్గ.. ఆయన, "చాలా నిరుత్సాహంగా అనిపించింది" అని బదులిచ్చారు.












Click it and Unblock the Notifications