జయ ఢిల్లీ యాత్ర
చెన్నై ః తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఢిల్లీ బయలుదేరి వెళ్లుతున్నారు. రాష్ట్ర వార్షిక ప్రణాళిక కేటాయింపుల గురించి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునితో మంతనాలు జరిపేందుకు తాను ఢిల్లీ వెళ్లుతున్నట్టుగా జయ ప్రకటించినప్పటికీ ఆమె
పర్యటన అంతరార్ధం వేరని పరిశీలకులు అంటున్నారు.
కరుణానిధిఅరెస్టు వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ముగ్గురుసీనియర్ ఐపిఎస్ అధికారులను కేంద్ర సర్వీసులకు తిప్పిపంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన దరిమిలా ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కునేందుకు ఆమె ఢిల్లీ వెళ్లినట్టుగా చెబుతున్నారు. ఈ ముగ్గురు అధికారులను ఢిల్లీకి అప్పగించడానికి జయ తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి మద్దతును కూడగట్టడం అదే సమయంలో కేంద్ర హోం మంత్రి అద్వానీతో మాట్లాడి సర్ధుబాటు చేసుకోవడం ఆమె ఢిల్లీ యాత్ర పరమార్ధంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications