శివసేన బిజెపి తెగతెంపులు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయం అధికారులకు యుటిఐ కుంభకోణంతో సంబంధం వున్నదని ఆరోపణలు గుప్పించిన శివసేన ఎన్‌డిఎ నుంచి వైదొలిగే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తున్నది. బిజెపి కూడా చీటికిమాటికి చికాకులు సృష్టిస్తున్న శివసేనను వదిలించుకునేందుకు సిద్ధంగా వుంది. ప్రధాని కార్యాలయంపై విమర్శలు చేసిన శివసేన ఎంపి నిరుపమ్ సంజయ్ ప్రధానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన బిజెపి నేతలు
ఇప్పడు ఏకంగా శివసేన నేత థాకరేనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
వాజ్‌పేయికి సంజయ్ క్షమాపణ చెప్పినంత మాత్రాన సరిపోదని వారుఅంటున్నారు. బిజెపి నేతల తాజా డిమాండ్ వ్యూహాత్మకంగా చేస్తున్నదనిఅంటున్నారు. థాకరే క్షమాపణలు చెప్పడం జరగని పని అని బిజెపి నేతలకు బాగా తెలుసునని ఈ సాకుతో శివసేనతో తెగతెంపులు చేసుకునే ప్రయత్నంలో వారు వున్నారనిఅంటున్నారు.
సంజయ్ సోమవారం నాడు రాజ్యసభలో ప్రధానికి క్షమాపణ చెప్పేందకు ప్రయత్నించారు. అయితే రాజ్యసభ అధ్యక్షుడు కృష్ణకాంత్ ఇందుకు అనుమతించలేదు. దానితో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మనోహర్ జోషి, ఇంధన శాఖ మంత్రిసురేష్ ప్రభు సంజయ్‌ను తీసుకుని నేరుగా ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. అయితే వాజ్‌పేయి వారిని కలుసుకోవడానికి నిరాకరించారు.












Click it and Unblock the Notifications