ముఖ్యమంత్రికి మరింత భద్రత

ప్రధానికి సారీ చెప్పిన శివసేనఎం.పి.
న్యూఢిల్లీః యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా కుంభకోణంలో ప్రధాని కార్యాలయం పాత్ర వున్నదంటూ ఆరోపించిన శివసేనఎం.పి. సంజయ్‌ నిరుపమ్‌ ప్రధాని వాజ్‌ పేయికి బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీఅయిన శివసేన ఎం.పి. ఇటువంటి ఆరోపణలు చేయడాన్ని ప్రధాని తీవ్రంగా పరిగణించారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ముఖ్యంగా శివసేన వైఖరి పట్ల ఆగ్రహించిన వాజ్‌పేయి ఏకంగా రాజీనామాకు సైతం సిద్ధపడగా ఎన్డీఏ నేతలు ఆయనను బుజ్జగించినవిషయం విదితమే.

యు.టి.ఐ. కుంభకోణంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా శివసేనఎం.పి. నిరుపమ్‌ మాట్లాడుతూ ప్రధాని కార్యాలయం మాజీ అధికారిపేరును ప్రస్తావించారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా కూడా ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కుంభకోణంపై ప్రధానేస్వయంగా విచారణకు ఆదేశించడంతో వివాదానికి తావులేకుండా పోయిందని నిరుపమ్‌ తన లేఖలోపేర్కొన్నారు. ప్రధాని మనోభావాన్ని దెబ్బతీయాలని తాను అలా వ్యాఖ్యానించలేదని నిరుపమ్‌ తన లేఖలోవివరించారు.

యు.టి.ఐ. కుంభకోణంలో ప్రధాని కార్యాలయం పాత్ర వున్నదంటూ నిరుపమ్‌ చేసిన ఆరోపణలు ఎన్డీఏ ప్రభుత్వానికి మచ్చగా పరిణమించాయి. తన ఆరోపణలుమీ మనసుకు బాధకలిగిస్తే అందుకు తాను క్షమాపణలు కోరుతున్నానంటూ నిరుపమ్‌ మంగళవారం ప్రధానికి రాసిన లేఖలోపేర్కొన్నారు. యు.టి.ఐ. వ్యవహారంలో శివసేన అధినేత బాల్‌ థాకరే, నిరుపమ్‌ కూడా మొండి వైఖరి అవలంబించడంతో బిజెపి-శివసేన సంబంధాలు బెడిసికొట్టినట్లే అనిఅంతా భావించారు. అయితే నిరుపమ్‌ పట్టువీడి ప్రధానికి క్షమాపణ చెప్పడంతో ఈ సమస్య ఒక కొలిక్కి రాగలదని ఎన్డీఏ వర్గాలు భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+