సారీ చెప్పాం...ఆపైమీ ఇష్టంః థాకరె
ముంబయ్‌ః యు.టి.ఐ. కుంభకోణంపై చేసిన వ్యాఖ్యలకు తమ పార్టీ ఎంపి నిరుపమ్ ప్రధానికి బేషరతుగా క్షమాపణ చెప్పారని... అయినా బిజెపి తమతో తెగతెంపులు చేసుకోవాలనుకుంటే అభ్యంతరం లేదని శివసేన అధినేత బాల్ థాకరే అన్నారు. మంగళవారం ఆయన ముంబయ్ లో విలేకరులతో మాట్లాడుతూ బిజెపిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి తన హద్దులు తెలుసుకొని వ్యవహరించాలంటూ థాకరే మండి పడ్డారు.
యుటిఐ కుంభకోణంలో ప్రధాని కార్యాలయం మాజీ అధికారు పాత్రవుందంటూ శివసేనఎం.పి. నిరుపమ్ వ్యాఖ్యానించడం.... ఈ వ్యాఖ్యలు బిజెపి-శివసేన మధ్య చిచ్చురగిల్చినవిదితమే. మా ఎం.పి. బేషరతుగా క్షమాపణలు చెప్పాడు.అయినా తమతో స్నేహాన్ని వదులుకోవాలనుకుంటే అది బిజెపి ఇష్టం అని థాకరే ఆవేశంగా అన్నారు. శివసేనపై కువిమర్శలు చేయడం మానుకోవాలని ఆయన బిజెపికి హితవు పలికారు. వాజ్‌పేయి దేశానికి సారధ్యం వహించాలని మా విమర్శలు ప్రధాని కార్యాలయంపైనే కానీ, ప్రధాని పైన కాదని థాకరే అన్నారు. బిజెపి బెదిరింపులను శివసేన లొంగదని ఆయన స్పష్టం చేశారు.
- ప్రధానికిసారీ చెప్పిన శివసేన ఎం.పి.
- శివసేన బిజెపి తెగతెంపులు












Click it and Unblock the Notifications