అగ్నిప్రమాదం కేసులో ఐదుగురు అరెస్టు
చెన్నై: తమిళనాడు లోని మానసిక రోగుల శరణాలయంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి సంబంధించి పోలీసులు శరణాలయం నిర్వహకులతో సహా అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. శరణాలయం నిర్వాహకుడు మొహిదీన్ ఆయన సోదరుడు రజాక్, ముంతాజ్ మరో ఇద్దరు అరెస్టయినట్టు పోలీసులు చెప్పారు.
ప్రమాదానికి కారణంవిద్రోహమని శరణాలయం నిర్వాహకులు చెబుతున్నప్పటికీ పోలీసులు మాత్రం కనీస మానవహక్కులకు కూడా విలువలేకుండా నిర్వహాకులు పాశవికంగా ప్రవర్తించిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనిఅంటున్నారు. శరణాలయంలోని ఒక గుడిసె దగ్దం కావడంతోఅందులోని 26 మంది సజీవ దహనం అయ్యారు. మరో నలుగురి పరిస్థితి ప్రమాదకరంగా వుంది. ప్రమాదం జరిగిన సమయంలో వారంతా సంకెళ్లలో వుండటం వల్ల తప్పించుకోలేకపోయారని పోలీసులుఅంటున్నారు.












Click it and Unblock the Notifications