కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌కు పన్ను రాయితీలు

న్యూఢిల్లీః కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ రంగానికి పన్ను రాయితీలు కల్పిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి యశ్వంత్‌సిన్హా చెప్పారు. ఈ రంగానికి సంబంధించి ఎగుమతి దిగుమతుల విధానాన్ని కూడా సరళతరం చేయనున్నట్టుగా ఆయన చెప్పారు. హార్డ్‌వేర్‌ రంగానికి సంబంధించి పన్ను రాయితీలను తక్షణమే ప్రకటించడం లేదంటే రానున్న బడ్జెట్‌లో ప్రకటించడం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబధిత మంత్రిత్వశాఖలతో చర్చలు జరిపిన తర్వాత ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. హార్డ్‌వేర్‌ రంగానికి సంబంధించిన ప్రతినిధులతో సమావేశంలో ఇ-గవర్నెన్స్‌ కూడా ప్రస్తావనకు వచ్చింది. ఐటి పై వివిధ మంత్రిత్వశాఖల ఖర్చును పర్యవేక్షించేందుకు వీలుగా తాము త్వరలో వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+