కాశ్మీర్‌లో సైన్యానిదే పై చేయి
న్యూఢిల్లీః జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల పీచమణచడంలో భద్రతాదళాలదే పైచేయిగా వున్నదని కేంద్ర హో మంత్రి ఎల్‌కె అద్వానీ చెప్పారు. గత మూడు నెలలకాలంలో సరిహద్దుల్లో ఉగ్రవాదులను అనేక మందిని భద్రతాదళాలు మట్టుబెట్టాయని ఆయన చెప్పారు.
ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపుతున్నప్పటికీ వారికి ఎక్కడికక్కడ కళ్లెం వేయడంలో సాయుధ దళాలువిజయం సాధించాయని ఆయన అన్నారు. ప్రత్యక్ష యుద్దంలో వున్నట్టుగా పరోక్ష యుద్ధంలో ఫలితాలను వెంటవెంటనే రాబట్టడం కష్టమని ఆయన చెప్పారు. భద్రతాదళాలతో నేరుగా తలపడే ధైర్యం లేని తీవ్రవాదులు, ప్రభుత్వం దళాల సంచలన లేని ప్రాంతాల్లో అమాయకులను తమ టార్గెట్‌గాపెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల టూరిజం ఈ మధ్యనే మళ్లీ పుంజుకుంటున్నదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications