కృషి ప్రమోటర్ల ఆస్తుల జప్తు

హైదరాబాద్‌ ః వేలాది మంది డిపాజిటర్లను వంచించిన కృషి అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌, పదిమంది డైరెక్టర్ల ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

చెర్మన్‌వెంకటేశ్వరరావును డైరెక్టర్లను అరెస్టుచేయాల్సిందిగా కూడా ప్రభుత్వం ఆదేశించింది.శనివారం నాడు హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ఆర్‌బిఐ అధికారులు, పోలీసు అధికారులు, సహకారశాఖకుచెందివారితో కృషిబ్యాంకు వ్యవహారంపైసమీక్ష జరిపారు. కృషి బ్యాంకు డిపాజిటర్లు శుక్రవారంనాడు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకువిజ్ఞాపన పత్రం సమర్పించిన నేపథ్యంలోహోంమంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించారు.

ఈసమావేశంలో తొలిరోజునుంచి జరిగినసంఘటనలను అధికారులు హోం మంత్రికి వివరించారు.డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకే ప్రభుత్వంప్రాధాన్యత నిస్తుందని ఈ సమావేశంలో హోంమంత్రి స్పష్టం చేశారు. బ్యాంకు చైర్మన్‌, డైరెక్టర్లఆస్తులను వున్నవి వున్నట్టుగా జప్తు చేసుకోవల్సిందిగాఆయన ఆదేశించారు. వారి ఆస్తుల అమ్మకాలపై నిషేధంవిధించారు. ఎవరైనా అమ్మినా వాటిని రిజిస్టర్‌ చేయవద్దంటూరిజిస్ట్రేషన్‌ శాఖకు కూడా స్పష్టమైన ఆదేశాలుజారీ చేశారు.

కృషిబ్యాంకులో సుమారు పదివేల మంది డిపాజిటర్లకుసంబంధించి 31 కోట్ల రూపాయలు వున్నట్టుగాప్రభుత్వం తెలిపింది.
కృషి బ్యాంకు డిపాజిట్లకు సరిపడే విధంగా31 కోట్ల రూపాయలమేర రుణాలు మంజూరు చేసినట్టుగా వున్నదని ఈ రుణాల రికవరీకి చర్యలు తీసుకోవల్సిందిగా తాము ఆదేశించామని దేవేందర్‌గౌడ్‌ చెప్పారు.

అర్బన్‌ కో ఆపరేటివ్‌బ్యాంకులకు సంబంధించిన చట్టాలను మరింతకట్టుదిట్టం చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.కృషిబాంకులో ఇంత భారీ కుంభకోణం జరుగుతున్నాబయటకు రాకపోవడానికి కారణాలపై కూడా ప్రభుత్వందర్యాప్తు జరుపుతుంది. ఆడిటర్లు, అధికారులపాత్ర ఇందులో ఏమైనా వున్నదా అని కూడా దర్యాప్తుచేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+