మనీలా అగ్నిప్రమాదంలో 70మంది మృతి
మనీలాః ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో శనివారం తెల్లవారు జామునఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో పలువురు చిన్నారులతో సహా 70 మంది దుర్మరణం పాలయ్యారు.పెద్దసంఖ్యంలో ప్రజలు గాయపడ్డారు. శనివారం వేకువ జామున నగరంలోని ఓ హోటల్ లో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకుపెద్ద సంఖ్యంలో ప్రజలు తరలి వచ్చారు.
ఈ సందర్భంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. హోటల్ లోనిహాల్ నుంచి బయటకు వెళ్ళేందుకు సైతంసరైన దారి లేకపోవడంతో అధిక సంఖ్యలో మరణాలు సంభవించాయని భావిస్తున్నారు. మంటలతో పాటు దట్టమైన పొగలు వ్యాపించడంతో చాలా మంది ఊపిరాడక మరణించారు. మరణించిన వారిలో పలువురు చిన్నారులు వున్నారు.












Click it and Unblock the Notifications