మెట్రో రైల్వేకు త్వరలో మోక్షం
హైదరాబాద్‌ః హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో రవాణా వ్యవస్థను సరళతరం చేయడానికి ఉద్దేశించిన మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ ప్రాజెక్టును వచ్చే నవంబర్ కల్లా ప్రభుత్వం ప్రారంభించే అవకాశం వున్నది.
శనివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యున్నత స్థాయి ఉన్నతాధికారుల సమావేశంలో ఈ ప్రాజెక్టు స్థితిగతులపై సమీక్ష జరిపారు.రైల్వేశాఖతో సంయుక్త భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మెట్రోరైల్వే ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. కాగా ఈ సమావేశంలో బయోటెక్ ప్రాజెక్టు, అంతర్జాతీయవిమానాశ్రయం గురించి కూడా చర్చించారు.
ఇదిలా వుండగా రాష్ట్రంలోని బిసి హాస్టళ్ల స్థితిగతులపై వచ్చిన వార్తలను ముఖ్యమంత్రి శనివారం నాడు అధికారులతో చర్చించారు. హాస్టళ్లలోని పరిస్థితులను మెరుగుపర్చాలని ఆయన ఆదేశించారు. హాస్టళ్ల పరిస్థితిని మెరుగుపర్చడంతో పాటు హాస్టల్‌విద్యార్ధుల విద్యాప్రమాణాల మెరుగుదలకు కూడా కృషి చేయాలని ఆయన ఆదేశించారు. హాస్టళ్లలో వసతి సౌకర్యాల మెరుగుదలకోసం తక్షణ సాయంగా 3 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.












Click it and Unblock the Notifications