23న సర్పంచ్‌ల ప్రమాణస్వీకారం
హైదరాబాద్‌ః రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌లుగా గెలుపొందిన అభ్యర్ధులు ఈ నెల 23న పదవీ ప్రమాణస్వీకారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గ్రామసీమల అభివృద్ధికి జవహర్ గ్రామీణ సమృద్ధి యోజన కింద 110 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఇది కాకుండా 11 ఆర్ధిక కమిషన్ సూచించిన విధంగా మరో 156 కోట్ల రూపాయలను కూడా గ్రామాల అభివృద్ధికి విడుదల చేస్తున్నట్టుగా రాష్ట్ర పంచాయతీ శాఖ కమిషనర్ చెల్లప్ప వెల్లడించారు. అయితే ఈ నిధులను కేవలం మౌలిక వసతుల కోసమే ఉపయోగించాల్సివుంటుంది. కొత్తగా ఎన్నికైన గ్రామ కమిటీలు గ్రామాల అభివృద్ధికి తగిన ప్రణాళికలను తమకు పంపిస్తే తాము పరిశీలించి ఈస్కీమ్ కింద నిధులను మంజూరు చేస్తామని చెల్లప్ప తెలిపారు. ఏకగ్రీవంగా అభ్యర్ధులను ఎన్నుకున్న గ్రామాలకు త్వరలోనే ప్రత్యేక ప్రొత్సాహకాలను మంజూరు చేస్తున్నట్టుగా కూడా
ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications