తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం

చెన్నైః తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల రెండో రోజు శనివారం నాడు సభలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. తీవ్ర గందరగోళం, ప్రతిపక్షాల వాకౌట్‌ మధ్యనే 135 కోట్ల రూపాయలమేర అదనపు రాబడికి వడ్డనలతో తమిళనాడు ఆర్ధిక మంత్రి తమ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు.

డిఎంకె అగ్రనేతను తమిళనాడు పోలీసులుఅరెస్టు చేసిన తీరుకు వ్యతిరేకంగా, ఈ మధ్య తమపార్టీనిర్వహించిన ర్యాలీ సందర్భంగా పోలీసులు సృష్టించిన బీభత్సనికి నిరసనగా డిఎంకె సభ్యులుపెద్దఎత్తున నిరసన తెలియజేస్తూ సభనుంచి వాకౌట్‌ జరిపారు. తొలుత డిఎంకె నేతలపై పోలీసుల జులుంకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా సభాహక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని డిఎంకె సభ్యులు పట్టుబట్టారు. అధికార పక్ష సభ్యులు కూడా అదే గట్టిగా అడ్డుతగలడంతో ఉభయ పార్టీలమధ్య తీవ్రస్థాయిలోవాగ్వివాదం జరిగింది.

ప్రభుత్వాన్నిఅస్థిరపర్చాలన్న ఏకైక ధ్యేయం మినహా ప్రజాస్వామికంగా, చట్టబద్దంగా తమ విధులను నిర్వహించాలన్న ఆసక్తి లేదని డిఎంకెపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాగాబడ్జెట్‌లో కొత్తదనం ఏమాత్రం లేదని ప్రజలపైపెను భారం మోపడం తప్ప జయ సర్కారు కొత్తవిన్యాసం ఇందులో ఏమీ లేదని డిఎంకె నేత కరుణానిధి వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+