నకిలీ సర్టిఫికెట్ల ముఠాఅరెస్టు
కరీంనగర్: నకిలీ సర్టిఫికెట్ల ముఠాను బుధవారం కరీంనగర్ పోలీసులుఅరెస్టు చేశారు. ఈ ముఠా నకిలీ నోట్లను కూడా తయారు చేయడానికి పూనుకుంది. కరీంనగర్‌కు చెందిన మధుసూదన్ నేతృత్వంలో ఈ ముఠా ఉస్మానియా, కాకతీయ యూనివర్శీటీల నకిలీ పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేసి అమ్మడం సాగిస్తోందని కరీంనగర్ డిఎస్‌పి బుచ్చిరెడ్డి చెప్పారు.
ఈ ముఠా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తన కార్యకలాపాలు సాగించిందని ఆయన చెప్పారు. హైదరాబాద్ సమీపంలోని ఎల్.బి. నగర్‌లోని ఒక ఇంటిని అద్దెకు తీసుకుని యాభై వేలవిలువ చేసే యాభై రూపాయల నకిలీ నోట్లను ఈ ముఠా ముద్రించిందని ఆయన చెప్పారు. ఈ నకిలీ నోట్లు చెలామణిలోకి రాక ముందే ముఠానుఅరెస్టు చేయగలిగామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications