బాస్మతిపై ఆందోళన వద్దు: అజిత్
న్యూఢిల్లీ: బాస్మతి బియ్యం వంగడాలపై అమెరికా సంస్థపేటెంట్ హక్కులు పొందడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అజిత్ సింగ్ అన్నారు. ట్రేడ్ నేమ్ అమెరికా సంస్థకు ఇవ్వలేదని, బాస్మతిపై భౌగోళిక ఇండికేటర్ చట్టం కింద ప్రత్యేక హక్కులను పొందేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన చెప్పారు.
రిసెటిక్ అభివృద్ధి చేసిన నిర్దిష్టమైన మూడు వంగడాలు మాత్రమే రిజిస్టర్ అయ్యాయని, భారతదేశం తన వంగడాలను ఎగుమతి చేయడానికి ఇవేమీ అడ్డంకి కాదని ఆయన బుధవారం 40వ అఖిల భారతపరిశోధనా కార్మికుల సమావేశానంతరం చెప్పారు.
ప్రస్తుతం బాస్మతిపై ప్రత్యేక హక్కులు పొందడం సాధ్యం కాదని, ఈ విధమైన హక్కులు పొందే అవకాశం వైన్స్‌కు, స్పిరిట్స్‌కు మాత్రమే వుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశంలో రిజిస్టర్ చేయడానికి ప్రాధాన్యం ఇచ్చి, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ఆ తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటివో)లో సవరణలు కోరడానికి, ఇతర దేశాల్లో రిజిస్టర్ చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications