భక్తి శ్రద్ధలతోవినాయక పూజలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలు బుధవారంవినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.వినాయక విగ్రహాలను నెలకొల్పి పూజలు నిర్వహించారు. మహారాష్ట్రలోవినాయక చవితిని అత్యంత వైభవోపేతంగా జరుపుకున్నారు. ముంబాయిలో భారీవిగ్రహాలను స్థాపించారు. ఈ సందర్భంగా పలు భక్తి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రజలువినాయక చవితిని అత్యంత శ్రద్ధాసక్తులతో నిర్వహించుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో 11 వేలకుపైగా వినాయకుడి విగ్రహాలను నెలకొల్పారు. వివిధ రూపాల్లోవినాయక విగ్రహాలను నెలకొల్పి ప్రజలు తమ భక్తి శ్రద్ధలను ప్రదర్శించుకున్నారు. అయితే, నిరుటితో పోలిస్తే జంటనగరాల్లో తక్కువ సందడి కనిపించింది.












Click it and Unblock the Notifications