తుపాకుల కోసమే నక్సల్స్ దాడి
వరంగల్: తుపాకులను ఎత్తుకుపోవడానికేపీపుల్స్‌వార్ నక్సలైట్లు వరంగల్ జిల్లా ఏటూరు నాగారం పోలీసులుస్టేషన్‌పై దాడి చేసినట్లు నిరూపితమైంది. ఈ దాడిలో పాల్గొన్న ఇద్దరు లొంగిపోయినవారు ఇచ్చిన సమాచారం మేరకు ఈవిషయాన్ని పోలీసులు ధృవీకరించుకున్నారు. దాడి కోసం ఏటూరు నాగారం పోలీసుస్టేషన్ ముందు ట్రాక్టర్ తెచ్చి పెట్టిన ఆరె కుమారస్వామి, హైదరాబాద్ నుంచి ఇనుప గుండ్లను తెచ్చిననరహరి బుధవారం పోలీసులకు లొంగిపోయారు.
గత నెల 29వ తేదీనపీపుల్స్‌వార్ నక్సలైట్లు ఏటూరు నాగారం పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. ఈ దాడిలో ఒక పూజారితో పాటు పోలీసులు మరణించారు. నక్సల్స్ యాభైఅరవై మంది ఈ దాడిలో పాల్గొన్నారని పోలీసులకు లొంగిపోయిన వారు చెప్పారు. తమపై పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో తుపాకులు తీసుకుపోవడం సాధ్యం కాదని నక్సల్స్ వెనక్కి తగ్గారని వారన్నారు.












Click it and Unblock the Notifications