లోక్‌సభలో తెహెల్కాపై గందరగోళం
న్యూఢిల్లీ: తెహెల్కా ఉదంతం మరోసారి లోక్‌సభను కుదిపేసింది. అయితే, ఈసారి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) సభ్యుల వంతయింది. సైనికాధికారుల వద్దకు వేశ్యలను పంపినట్లు వచ్చిన వార్తలపై పోర్టల్ ఛీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌నుఅరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్‌డిఎ సభ్యులు లోక్‌సభలో బుధవారం డిమాండ్ చేశారు.
ఎన్‌డిఎ సభ్యులు గందరగోళం సృష్టించడంతోస్పీకర్ జి.ఎం.సి. బాలయోగి రెండుసార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది.
ముగ్గురు ఆర్మీ అధికారులను బుట్టలో వేసి వీడియో తీయడానికి తెహెల్కా వేశ్యలను పంపినట్లు వచ్చిన పత్రికా వార్తల కాపీలను ప్రదర్శిస్తూ ఎన్‌డిఎ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు.
రక్షణ కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలను తెహెల్కా బయటపెట్టిన నేపథ్యంలో వాజ్‌పేయి ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పక్షం రోజుల పాటు నాలుగు నెలల క్రితంబడ్జెట్ సమావేశాలను స్తంభింపజేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంలో బిజెపి అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్, సమతా పార్టీ ఛీఫ్ జయా జైట్లీతమ తమ పార్టీ పదవులకు రాజీనామాలు కూడా చేశారు.












Click it and Unblock the Notifications