ఉపఎన్నికల్లో టిడిపికి బిజెపి మద్దతు
తిరుపతి: వచ్చే శాసనసభ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు తాము మద్దతు ఇస్తామని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి చెప్పారు. కేంద్ర మంత్రి కృష్ణంరాజుతో పాటు ఆయన శనివారం ఇక్కడ వివిధ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సిద్ధిపేట, ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీకి దిగబోదని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను తాము బలపరుస్తామని ఆయన చెప్పారు. శాసనసభ, లోక్‌సభలకు జరిగిన ఎన్నికల్లో తమకు, తెలుగుదేశం పార్టీకి మధ్య కుదిరిన ఒప్పందంలో బాగంగా ఈ రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే పోటీ చేశారని,అందువల్ల ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి తమ మద్దతు వుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications