ఆనందంలో హరికృష్ణ కుటుంబం
గుంటూరు: హరికృష్ణ కామన్‌వెల్తు ఛాంపియన్‌షిప్ గెల్చుకోవడంతో గుంటూరు జిల్లాలోని యడ్లపాడులో గల అతని కుటుంబ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 15 ఏళ్ల మూడు నెలల వయస్సులోనే హరికృష్ణ ఈ ఛాంపియన్‌షిప్ గెల్చుకోవడం పట్ల హరికృష్ణ తాత రంగారావు ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఒక రోజులో సాధించనివిజయం కాదని ఆయన అన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా హరికృష్ణను సిద్ధం చేశామని ఆయన చెప్పారు.
అతి చిన్న వయస్సులో తమ మనవడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌నుఅందుకోగలడనే నమ్మకం ఉన్నదని, అయితే,విశ్వనాథన్ ఆనందన్ వంటి వారిని ఎదుర్కోవడానికి కోచ్‌లను ఎలాపెట్టుకోవాలి, ఖర్చు ఎలా భరించాలి అనేది పెద్ద సమస్యగా వున్నదని ఆయన అన్నారు.
విప్రో రెండేళ్లుగా హరికృష్ణకు ఆర్థిక సహాయం అందిస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహాయంఅందిస్తే హరికృష్ణను ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు సిద్ధం చేయడం సుళువు అవుతుందని ఆయన అన్నారు.
ఆరు నెలల ముందే హరికృష్ణ గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించేవాడని, అయితే, పదో తరగతి పరీక్షల వల్ల జాప్యం జరిగిందని అతని తలిదండ్రులు నాగేశ్వరరావు, పద్మావతి అన్నారు. తమ కుమారుడు కామన్‌వెల్తు ఛాంపియన్‌షిప్ సాధించడం పట్ల వారు ఆనందరం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications