ప్రజలకు చేరువగా ఐటి: బాబు
బెంగూళూర్: ప్రజలకు చేరువగా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి)ని తీసుక వెళ్లనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. బెంగుళూర్‌లో ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీపై నిర్వహించిన సదస్సులో మంగళవారం కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రసంగించారు.
ఐటి రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో మానవ వనరులు పుష్కలంగా వున్నాయని, ఐటిలో కర్ణాటక ముందున్నప్పటికీ తమకున్నఅపార మానవ వనరులతో కర్ణాటకతో పోటీ పడగలమని చంద్రబాబు అన్నారు. ఐటి సంపన్నులకే అనేఅపోహను తొలగించి సామాన్యులకు, పేదలకు ఉపయోగపడేలా అభివృద్ధి పరచగలమని ఆయన అన్నారు. ఐటి అభివృద్ధికి కంప్యూటర్, ఎలక్ట్రానిక్ వస్తువులపై పన్నులు తగ్గించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. టెలికాం సౌకర్యాలు, బాండ్‌విడ్త్ పెంచాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. టెలికాం రంగంలో ప్రభుత్వ గుత్తాధిపత్యం పోవాలని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications