జమ్మూలో పూజారుల దారుణ హత్య
న్యూఢిల్లీః జమ్మూలోని సూరన్‌కోట్ పట్టణంలో సోమవారం రాత్రి ఇద్దరు హిందూ పూజారులను గుర్తుతెలియని ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. సూరన్‌కోటలోని ఒక ఆలయంలో అర్చకులుగా వున్న ఇద్దరిని ఉగ్రవాదులు తలనరికి చంపినట్టుగా పోలీసులు చెప్పారు.
ఈ సంఘటన దరిమిలా జమ్మూ, పూంచ్ ప్రాంతాల్లో అధికారులు నిరవధిక కర్ఫ్యూ ప్రకటించారు. పూజారుల హత్య వార్త బయటకు పొక్కడంతోనే ఈ ప్రాంతాల్లో తీవ్రఉద్రిక్తత నెలకొన్నది. వందలాది మంది ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చి నినాదాలు చేస్తూ ప్రదర్శనలు జరిపారు. పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం వున్నదని పసిగట్టిన అధికారులు ముందుజాగ్రత్తగా కర్ఫ్యూ ప్రకటించారు.












Click it and Unblock the Notifications