కృషి చైర్మన్ కృష్ణాలోనే దాగున్నాడు
న్యూఢిల్లీః రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారులకు ప్రపంచబ్యాంకు నిపుణుల బృందం రాష్ట్ర అభివృద్ధిపై పాఠాలు ప్రారంభించింది. ప్రపంచబ్యాంకుకు సంబంధించిన ఇద్దరు సీనియర్ అధికారులు డాక్టర్ రే సిరీస్, శ్రీమతి జోడె కోసిక్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో ఈ క్లాస్‌లు ప్రారంభించారు.
అయిదు రోజుల పాటు ఈ క్లాస్‌లు సాగుతాయి. వివిధ ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు బాధ్యత వహిస్తున్న ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అభివృద్ధి పథకాలను, ఏ విధంగా అమలు చేయాలి, సామాజిక అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈ కార్యక్రమంలో అధికారులకు ప్రపంచబ్యాంకు ప్రతినిధులు నేర్పుతారు. భారత దేశానికి సంబంధించిన ప్రాధమిక అవగాహన కూడా లేని ప్రపంచబ్యాంకు అధికారులు అభివృద్ధిపై తమకు పాఠాలు చెప్పడానికి పూనుకోవడం పట్ల సహజంగానేసీనియర్ అధికారుల్లో అసహనం కనిపించింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుద్ధిగా క్లాసులువినాలని ఆరంభంలోనే గట్టిగా చెప్పడంతో వారు విధిలేక తరగతులకు హాజరవుతున్నారు.












Click it and Unblock the Notifications