మళ్లీ తెర మీదికి లక్ష్మణ్
న్యూఢిల్లీ: తెహెల్కా బయట రక్షణ కుంభకోణంతో బిజెపి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బంగారు లక్ష్మణ్ తిరిగి తెరమీదికి వస్తున్నారు. దాదాపు ఐదు నెలల పాటు ఆయన తెర మరుగనే వుండిపోయారు. దక్షిణాఫ్రికాలోని దర్బన్‌లో శుక్రవారం నుంచి ఎనిమిది రోజుల పాటు జరిగే జాతివివక్ష ప్రపంచ సదస్సుకు వెళ్తున్న అధికారిక భారత ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. ఈ రకంగా ఆయన మళ్లీ తెరమీదికి వస్తున్నారు.
తనను దర్బన్ బృందానికి నేతృత్వం వహించేందుకు ఎంపిక చేయడం పట్ల బంగారు లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశారు. రక్షణ కుంభకోణంలో తనను ఇరికించారనేవిషయం మెల్లగా వెల్లడవుతోందని, తాను తిరిగిపూర్వ స్థితికి వస్తానని ఆయన అన్నారు.
సైనికాధికారులను బుట్టలో వేయడానికి తెహెల్కా వ్యభిచారిణులను వాడినట్లు వార్తలు వచ్చిన వారం రోజుల తర్వాత లక్ష్మణ్ మళ్లీ తెరమీదికి వస్తున్నారు. తెహెల్కా అనైకతకు పాల్పడిందనేవిమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆయన మౌనం వీడారు.












Click it and Unblock the Notifications