కేంద్రం తీరుపై ఆంధ్ర ఎంపీల నిరసన
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు కరువు సహాయక చర్యల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న కేంద్రంపై రాష్ట్ర పార్లమెంటు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. కరువు సహాయక చర్యల కోసం కేంద్ర రాష్ట్రానికి ఒక్కపైసా కూడా విడుదల చేయకపోవడం పట్ల వారు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ వైపరీత్యాల కమిటీని వెంటనే సమావేశ పరిచి రాష్ట్రానికి సహాయంఅందించే విషయమై చర్చ జరపాలని వారు కేంద్ర ప్రభుత్వాన్నికోరారు.
రాష్ట్రంలోని 900కుపైగా మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, కరువుఅంచనాకు బృందాన్ని పంపించిన ప్రభుత్వం సహాయంఅందించడంలో సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు అన్నారు. కరువు సహాయానికి నిధులు విడుదల చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని వారన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడంలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులతో గొంతు కలిపిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు రాష్ట్ర ప్రభుత్వంపైవిమర్శలు గుప్పించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రచార కార్యక్రమాలు చేపట్టడంలో ఉన్న శ్రద్ధ ప్రజలకు సహాయంఅందించడంలో లేదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు రేణుకా చౌదరివిమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారంపై 13 వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, బిల్ గేట్స్, బిల్ క్లింటన్‌లు గుర్తు వచ్చే రాష్ట్ర ప్రభుత్వానికి కరువు పీడిత ప్రాంతాల ప్రజలు గుర్తు రావడం లేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications