కెసిఆర్‌ నామినేషన్‌ దాఖలు

సంగారెడ్డి: సిద్ధిపేట శాసనసభా నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. తన నామినేషన్‌ పత్రాలను ఆర్డీవో కార్యాలయంలో సమర్పించారు. మరో ముగ్గురు డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.

చంద్రశేఖర్‌ రావు నామినేషన్‌ వేయడానికి ముందు మెదక్‌ జిల్లాలోని అన్ని ప్రాంతాలనుంచి కార్యకర్తలతో భారీ ఊరేగింపు జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తాను పోటీలోకి దిగుతున్నానని చంద్రశేఖర్‌ రావు అన్నారు.

తనవిజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా మద్దతుతో తాను నామినేషన్‌ వేశానని ఆయన చెప్పారు. తనను గెలిపించి సిద్ధిపేట నియోజకవర్గం ప్రజలు తెలంగాణా రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమానికి ఊపునిస్తారని ఆయన అన్నారు. ఆర్థిక సంస్కరణలపేర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజల నడ్డి విరగ్గొడుతున్నారని ఆయనవిమర్శించారు.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన చంద్రశేఖర్‌ రావు రాజీనామా చేసి తెలంగాణా రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడంతో సిద్ధిపేట నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+