అందుబాటులో తెలుగు సాఫ్ట్‌వేర్
హైదరాబాద్: ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భాషాపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. మైక్రోసాఫ్ట్ తొమ్మిది భారతీయ భాషలతో తెలుగు భాషలోరూపొందించిన వర్డ్ ప్రాసెసింగ్, ఆపీస్ ఎక్స్‌పిని గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విడుదల చేశారు. దీని ద్వారా ఎంఎస్ వర్డ్, ఫ్రంట్‌పేజ్, ఎక్సెస్, తదితర సౌకర్యాలు తెలుగులో అందుబాటులోకి వస్తాయి.
రాష్ట్రంలోని రెండు వేల పాఠశాలల్లో దూరవిద్యకు గాను దీన్ని వాడుకోవాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు.ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా తెలుగు సాఫ్ట్‌వేర్ గ్రామీణ ప్రాంతాలకుఅందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications