తీహార్లో జైల్లోనే సీజేపీ నేతలు సౌరవ్, అశుతోష్..! కస్టడీ ముగిసినా తేల్చని కోర్టు..!

ఢిల్లీనిరసనల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసిన కాక్రోచ్ జనతా పార్టీ కీలక నేతలు (CJP Leaders) సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ప్రస్తుతం తీహార్ జైల్లోనే ఉన్నారు. ఇప్పటికే కోర్టు వారికి విధించిన ఐదురోజుల జ్యూడిషియల్ కస్టడీ పూర్తయింది. దీంతో వారి బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరపాల్సి ఉంది. అయినా స్థానిక కోర్టు మాత్రం వివిధ కారణాలతో వారి కేసును విచారించకుండా ఆలస్యం చేస్తోంది. ఇవాళ మరోసారి అలాంటి పరిణామాలే చోటు చేసుకోవడంతో విచారణ ముందుకు సాగలేదు. దీనిపై సీజేపీ లీగర్ హెడ్ రత్నాసింగ్ మండిపడ్డారు.

జగన్ కామెంట్స్ పై జాతీయ స్ధాయిలో చర్చ..! అదే టర్నింగ్ కాబోతోందా ?
జగన్ కామెంట్స్ పై జాతీయ స్ధాయిలో చర్చ..! అదే టర్నింగ్ కాబోతోందా ?

సీజేపీ సహ-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన తర్వాత తీహార్ జైల్లోనే వారు ఉన్నారు. వీరిని విడిపించేందుకు పార్టీ లీగల్ హెడ్ రత్న సింగ్ ఇవాళ కూడా విఫలయత్నం చేశారు. తాము ఉదయం నుండే ఇక్కడ ఉన్నామని, విచారణ మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుందని తమకు చెప్పారని, ఈరోజు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని, ధృవీకరణ జరిగిందని, అవసరమైన అన్ని నిబంధనలు నెరవేరాయని రత్నా సింగ్ తెలిపారు. దీంతో స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మధ్యాహ్నం 1:30 గంటలకే పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నప్పటికీ, సాయంత్రం 5 గంటల వరకు కోర్టు గదిలోకి రాలేదన్నారు.

CJP Leaders Still in Custody Four Sureties Rejected as Party Questions Delay in Release
Abhijeet Dipke:
Abhijeet Dipke:

ఆయన వచ్చిన తర్వాత, సౌరవ్ , అశుతోష్‌లను జ్యుడీషియల్ కస్టడీ నుండి విడుదల చేయాలా వద్దా అనే అంశంపై కేసులోని వాస్తవాలను వినడానికి నిరాకరించారని రత్నా సింగ్ తెలిపారు. దానికి బదులుగా, ఆయన అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారన్నారు. గత నాలుగు రోజులుగా పోలీస్ స్టేషన్‌కు రాని పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇవాళ హాజరయ్యారని, విచారణ మొదలైన ఐదు నిమిషాలకే, తనకు ఒక బెదిరింపు మెసేజ్ వచ్చిందని కోర్టుకు చెప్పారన్నారు. దీంతో మొత్తం చర్చ ఆ మెసేజ్ చుట్టూనే తిరిగిందన్నారు. ఇదంతా ముందే ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోందని రత్న ఆరోపించారు. సౌరవ్, అశుతోష్‌ల విడుదలకు అవసరమైన లాంఛనాలు పూర్తయ్యాయా లేదా అనే విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టి, కేవలం ఆ బెదిరింపు సందేశంపైనే దృష్టి పెట్టాలని వారు ముందే నిర్ణయించుకున్నారన్నారు. ఈ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసిన తీరు, వ్యవహరించిన విధానం చూస్తుంటే తనకు తీవ్ర నిరాశ కలిగిందని రత్నా సింగ్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+