Abhijeet Dipke: "ఈ 3.30 గంటల ఫాంటసీ ఏంటో ?"- ఢిల్లీ పోలీసుల విచిత్ర అలవాటుపై దిప్కే..!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ గత వారం రోజులుగా నిరసనలకు దిగుతోంది. ఇప్పటికే కాక్రోచ్ పార్టీ ఛీఫ్ అభిజీత్ దిప్కే (Abhijeet Dipke)ను పోలీసులు రెండుసార్లు అరెస్టు చేశారు. ఓసారి ఢిల్లీలో దిగుతుండగా విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. మరోసారి కన్నాట్ ప్లేస్ లో తిరంగా ర్యాలీ సందర్భంగా అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ కామన్ గా ఓ ఘటన జరిగింది.

ట్రంప్ కు ఢిల్లీ నిరసనలసెగ..! పోలీసుల తీరును ప్రశ్నించాలని ఒత్తిళ్లు..!
ట్రంప్ కు ఢిల్లీ నిరసనలసెగ..! పోలీసుల తీరును ప్రశ్నించాలని ఒత్తిళ్లు..!

రెండుసార్లు అభిజీత్ దిప్కేను అరెస్టు చేసిన సందర్భంగా ఢిల్లీ పోలీసులు ఒకే విధంగా వ్యవహరించారు. దీంతో వారి వ్యవహారశైలిని ప్రశ్నిస్తూ దిప్కే తాజాగా ట్వీట్ చేశారు. ఇందులో దిప్కే.. ఢిల్లీ పోలీసులకు ఒక విచిత్రమైన అలవాటు ఉందని పేర్కొన్నారు. ముందుగా వారు మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటారు, కానీ ఆ సమయంలో మీకు న్యాయవాదులను కలిసే అవకాశం అస్సలు ఇవ్వరు. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో మీకు గానీ, మరెవరికి గానీ చెప్పరని ఆరోపించారు.

Why 3 30 AM Abhijeet Dipke Questions Delhi Police Over Arrest Papers and Lawyer Access

ఆ తర్వాత, అర్ధరాత్రి దాటి 3:30 గంటల సమయంలో, అకస్మాత్తుగా అరెస్టు పత్రాలతో ప్రత్యక్షమవుతారని దిప్కే తెలిపారు. చివరకు, తెల్లవారుజామున 4 గంటలకు మీ న్యాయవాదికి ఫోన్ చేస్తారన్నారు. ఇలా తన విషయంలో ఇప్పటికే రెండుసార్లు జరిగిందని దిప్కే ఆరోపించారు. అసలు ఈ తెల్లవారుజామున 3:30 గంటలకు ఏముంది ? అంతటి 'శుభ ముహూర్తం', ఢిల్లీ పోలీసులారా? అంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఛీఫ్ వారిని ప్రశ్నించారు.

Why 3 30 AM Abhijeet Dipke Questions Delhi Police Over Arrest Papers and Lawyer Access
అభిజీత్ దిప్కే, నేహా బోరాల నిర్బంధంపై విపక్షాల ఫైర్..! ఎవరేమన్నారంటే..!
అభిజీత్ దిప్కే, నేహా బోరాల నిర్బంధంపై విపక్షాల ఫైర్..! ఎవరేమన్నారంటే..!

అయితే వాస్తవానికి అభిజీత్ దిప్కేకు ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా, ఆయన్ను పగలు అదుపులోకి తీసుకోవడం, రాత్రికి అరెస్టు చూపించడం, ఉదయం కోర్టులో హాజరుపర్చడం చేస్తున్నారు. దీంతో దిప్కే ఎక్కడున్నాడో తెలియక ఆందోళన చెందాల్సిన పరిస్ధితులు సీజేపీ నేతలకు ఎదురవుతున్నాయి. చివరికి పోలీసులు అరెస్టు చూపించిన తర్వాత, దిప్కేకు బెయిల్ కోసమో, విడుదల కోసమో వారు కోర్టుల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో దిప్కే ఢిల్లీ పోలీసుల తీరును తప్పుబడుతూ ఈ ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+