ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.. స్పెషల్ ఎట్రాక్షన్ గా విజయ్‌, రష్మిక

తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఊరూవాడా అని తేడా లేకుండా ఆడపడుచులు ఆనందోత్సాహాల మధ్య కన్నుల పండుగలా జరుపుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి సంప్రదాయ పాటలు, కోలాటాలతో సందడి చేశారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా మహిళలంతా ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇక హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద సద్దుల బతుకమ్మ సంబరాలను రాష్ట్రప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ, కళా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. స్పెషల్ ఎట్రాక్షన్ గా విజయ్ దేవరకొండ- రష్మిక మందాన్న జోడీ నిలిచింది. రష్మిక తెలంగాణ ఇంటి కోడలిగా బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఇక విజయ్- రష్మిక జోడిని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క ఘనంగా సన్మానించారు. బతుకమ్మ వేడుకలకు పిలవగానే వచ్చిన విజయ్- రష్మిక దంపతులను జూపల్లి అభినందించారు. ఇక ఈ వేడుకలో మాట్లాడిన విజయ్ రష్మికలు ప్రజలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ కోడలిగా బతుకమ్మ పండుగలో పాల్గొని అందరితో ఆడి పాడడం అదృష్టంగా భావిస్తున్నట్లు రష్మిక పేర్కొన్నారు. అలాగే ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన ఈ బతుకమ్మ వేడుకలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు కూడా హాజరయ్యారు.

SaddulaBathukamma celebrations at Tank Bund Vijay and Rashmika emerge as the special attraction now

అటు తెలంగాణ పల్లెపల్లెనా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంటింటా రంగు రంగుల పూల‌తో బతుక‌మ్మల‌ను పేర్చి మ‌హిళ‌లు నూత‌న ప‌ట్టు వ‌స్త్రాలు ధ‌రించి బ‌తుక‌మ్మ‌ల‌ను ఎత్తుకుని వేదిక‌ల వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత బ‌తుక‌మ్మ ఆటపాటలతో చిన్నా పెద్దా అని తేడా లేకుండా అంతా కలిసి సందడి చేశారు. ఈ క్రమంలో బతుక‌మ్మ పండగతో ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు ప్ర‌త్యేక శోభ‌ను సంత‌రించుకున్నాయి. పట్టణాలే కాకుండా రాష్ట్రంలోని ప‌ల్లెల‌న్నీ బ‌తుక‌మ్మ డీజే పాట‌ల‌తో మార్మోగిపోయాయి. అలాగే నల్గొండ, వరంగల్ జిల్లాల్లో బతుకమ్మ పండగ సంబరాలు అంబరాన్ని తాకాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+