దసరాకి విష్ణుప్రియ గ్లామర్ ట్రీట్.. అలాంటి ఫోజుల్లో అరాచకం!
తెలుగు నాట స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు విష్ణుప్రియ భిమనేని. అయితే యాంకరింగ్ కంటే ఇతర విషయాల్లోనే ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే విష్ణుప్రియ.. తన వ్యక్తిగత విషయాలతో పాటు హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో కుర్రాళ్లను రెచ్చగొడుతుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలతో బిజీగా ఉంటున్నారు విష్ణుప్రియ. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో ఎన్నో కష్టాలు పడింది ఈ ముద్దుగుమ్మ. తల్లి వద్దే పెరిగిన ఈ యాంకర్.. అమ్మకి అండగా నిలవాలనే ఉద్దేశంతో తన పాకెట్ మనీ, ఇతర ఖర్చుల కోసం తనే సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది. చిన్నప్పటి నుంచే భారతీయ పురాణాలు, భగవద్గీత మీద పట్టు ఉంది. అలా పిల్లలకు భగవద్గీత క్లాసులు చెబుతూ తన ఖర్చులు సంపాదించుకున్నారు విష్ణుప్రియ.

పరిశ్రమలోకి వచ్చాక ఫన్ బకెట్ వీడియో కోసం 500 రూపాయలను తొలుత రెమ్యునరేషన్‌గా అందుకున్న జ్ఞాపకం జీవితంలో మరిచిపోలేనని విష్ణుప్రియ పలుమార్లు ఎమోషనల్ అయ్యారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన తర్వాత ఆమె మరింత పాపులర్ అయ్యారు. అవకాశాల కోసం ఎదురుచూడకుండా తనే అవకాశాలను క్రియేట్ చేసుకున్నారు విష్ణుప్రియ. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చిన సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ద్వారా ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ షేర్ చేస్తున్నారు. ఆమె సబ్స్క్రిప్షన్ పేజికి వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీని ద్వారా విష్ణు నెలకు లక్షల్లో సంపాదిస్తోంది.
ఈ విషయంపై అయినా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం విష్ణుప్రియ స్టైల్. తనకు మూడు సార్లు బ్రేకప్ అయ్యిందని, అలాగే తన బాడీ కౌంట్ 5 అని చెప్పింది. అంటే ఐదుగురితో రొమాన్స్ చేసినట్లు ఒప్పుకుంది. ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ గురించి కూడా విమర్శలు రాగా దానికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు విష్ణుప్రియ. అంతేకాదు.. నెలకు 399 సబ్స్క్రిప్షన్ ఫీజు అంటే చాలా ఎక్కువగా ఉందని కొంచెం తగ్గించాలని అడగ్గా.. ససేమిరా అని నో చెప్పేసింది.
ఇక విష్ణుప్రియకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 1.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తన వ్యక్తిగత విషయాలు, ఇతర అంశాలు, వీడియోలు, ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు ఈ ముద్దుగమ్మ. తాజాగా దసరా పర్వదినం నేపథ్యంలో విష్ణుప్రియ అందంగా ముస్తాబై ఫోటో షూట్ నిర్వహించారు. గేటు ముందు నిలబడి రొమాంటిక్ ఫోజుల్లో అందాల విందు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం విష్ణుప్రియ అందాలపై ఓ లుక్కేయండి.












Click it and Unblock the Notifications
