తెలుగులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌ఎక్స్‌పి
హైదరాబాద్‌ః అన్ని రకాల అంతర్జాతీయ ప్రమాణాలతో మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్స్‌పి తెలుగువెర్షన్‌ను గురువారం నాడు విడుదల చేశారు. ప్రస్తుతం ఇంగ్లీష్ భాషా మాధ్యమం కారణంగా ఆఫీస్ ఎక్స్‌పి ద్వారా పొందగల ప్రయోజనాలన్నీ ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి తెలుగు భాషా మాధ్యమంలో కూడా పొందవచ్చు. వర్డ్, ఎక్సైల్, పవర్‌పాయింట్, ఔట్‌లుక్, ఫ్రంట్ పేజీ అప్లికేషన్స్ అన్నింటా తెలుగును ఈ కొత్త వెర్షన్ సపోర్ట్ చేస్తుంది.
తెలుగులో డాక్యుమెంట్ డిస్కషన్స్, పాస్‌వర్డ్ సేవ్ చేసుకోవడానికి, హైపర్‌లింక్స్, వెబ్ పేజీలు క్రియేట్ చేయడానికి తమ ప్రాడక్ట్ ఉపకరిస్తుందని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. స్మార్ట్ టాగ్స్, టాస్క్ పాన్స్, కాలెండర్స్ కూడా తెలుగులో వుంటాయి. ఉపయోగిస్తున్న పదాలను సరిచూసుకునే సౌకర్యం స్పెల్‌చెక్ కూడా తెలుగులో వుంది. ఆటో కరెక్షన్‌లో ఒక పదాన్ని తప్పుగా కంపోజ్ చేసినా వెంటనే అది సరిచేస్తుంది. ఆఫీస్ ఎక్స్‌పి తెలుగువెర్షన్ రిటైల్ ధర 20 వేల రూపాయలు కాగా ప్రూఫింగ్ టూల్ కిట్ ధర 3800 రూపాయలు వుంది.
అమెరికాలోని రెడ్‌మండ్‌లో వున్న మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ సెంటర్‌లోని కాంప్లెక్స్ స్క్రిప్ట్ గ్రూప్ తెలుగువెర్షన్ డెవలప్‌మెంట్‌లో ప్రధాన పాత్ర వహించింది. యునికోడ్ ఆధారిత ఎస్‌కె సిస్టమ్‌పై దీనిని డెవలప్ చేశారు.












Click it and Unblock the Notifications