12 మంది మిలిటెంట్ల కాల్చివేత
శ్రీనగర్: కాశ్మీర్‌లోకిపెద్ద యెత్తున చొరబాటుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌లో శిక్షణ పొందినమిలిటెంట్లపై భారత బలగాలు జరిపిన కాల్పుల్లో 12 మంది తీవ్రవాదులు మరణించారు. ఈ సంఘటన ఉత్తర కాశ్మీర్‌లోని కుఫ్‌వారా జిల్లాలో గురువారం రాత్రి జరిగింది.
చొరబాటుదారులు భారీ ఆయుధ సామగ్రితో గురువారం రాత్రి నియంత్రణ రేఖ దాటి కాశ్మీర్‌లోకి ప్రవేశించడానికి మాకెర్గలి వద్ద భారతసైనికులకు, మిలిటెంట్లకు మధ్య పెద్ద యెత్తున ఎదురుకాల్పులు జరిగాయి.
ఇప్పటి వరకు 12 మంది చొరబాటుదారులు మరణించినట్లు, ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు అధికారవర్గాలు చెప్పాయి. కుప్‌వారాసెక్టార్‌లోని తంగ్‌ధార వద్ద కాశ్మీర్ లోయలోకి ప్రవేశించడానికిమిలిటెంట్లు చేసిన ప్రయత్నాన్ని భారత సైనికులు తిప్పికొట్టారు.












Click it and Unblock the Notifications