సీమాంతర ఉగ్రవాదంపై ఉక్కుపాదం
న్యూఢిల్లీః సీమాంతర ఉగ్రవాదంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని ప్రధాని వాజ్‌పేయి ప్రకటించారు. జిహాద్ పేరుతో సాగుతున్న ఉగ్రవాదుల హింసాకాండ భారత భూభాగం నుంచి జమ్మూకాశ్మీర్ నుంచి వేరు చేయజాలదని ఆయన స్పష్టం చేశారు. భారత 55 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం వాజ్‌పేయి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆగ్రా శిఖరాగ్రం వైఫల్యానికి పాకిస్తాన్ అధినేత ముషారఫ్ కారణమని ఆయన చెప్పారు. ఆగ్రా శిఖరాగ్ర సభ తర్వాత దేశంలో తీవ్రవాదులు దాడులు హింసాకాండపెరిగిపోయాయని ఆయన చెప్పారు.
ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు సరిహద్దుల్లో శాంతికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు పాకిస్తాన్ తగురీతిలో ప్రతిస్పందిచడం లేదని ఆయన ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్‌లోస్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా ఆయన చెప్పారు. ఈశాన్యరాష్ట్రాల్లో ప్రబలుతున్న హింసాకాండ పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రకోటపై జెండా ఎగురవేయడానికి ముందు ప్రధాని రాజ్‌ఘాట్ సందర్శించి జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications