ఎక్సైజ్ స్టేషన్లో లాకప్‌డెత్
శృంగవరపుకోటః విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎక్సైజ్ పోలీసు స్టేషన్లో పరదేశి రఘురాం అనే 27 ఏళ్ల యువకుడు మరణించిన సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ఈ సంఘటనపై ఆగ్రహించిన ఆదివాసీలు ధర్నా జరిపి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. శృంగవరపు కోటలో మద్యం సిండికేట్ రైడ్పార్టీ సభ్యులు,ఎక్సైజ్ అధికారులు నాటుసార తయారు చేస్తున్న వారిని అడ్డుకునేపేరుతో దాడులకు బయలుదేరారు. ఈ సందర్భంగా తమ జిల్లా సరిహద్దులను దాటివిశాఖజిల్లా పరిధిలోని చిలకలగడ్డకు వెళ్లి అక్కడ రఘురాంను అదుపులోకి తీసుకున్నారు.
రఘరామ్అరెస్టును అడ్డుకున్న గిరిజనులకు ఆయన్ను తెల్లవారి వదిలిపెడతామని నచ్చజెప్పినట్టుగా తెలిసింది. తెల్లారేసరికిఎక్సైజ్ పోలీసుల లాకప్‌లో ఉరివేసుకుని రఘురాం ఆత్మహత్య చేసుకున్నట్టుగా గ్రామానికి సమాచారంఅందింది. ఆగ్రహంతో ధర్నాకు దిగిన గిరిజనులను శాంతింపజేయడానికి మృతుని కుటుంబానికి మూడెకరాల సాగు భూమిని ఇవ్వనున్నట్టుగా అధికారులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications