విజయా బ్యాంకు హౌసింగ్ మేళా
హైదరాబాద్‌ఃవిజయా బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 2000-2001 సంవత్సరంలో 277.13 లక్షల నికర లాభం ఆర్జించింది. ఈ ఏడాది 75 కోట్ల రూపాయల హౌసింగ్ రుణాలను ఇవ్వాలని బ్యాంకు లక్ష్యంగాపెట్టుకుంది. ఇళ్ళ నిర్మాణాలకే గాక విస్తరణకు, ఇంటి ప్లాట్ల కొనుగోళ్ళకు కూడా రుణాలు ఇవ్వనున్నట్టు హైదరాబాద్ శాఖసీనియర్ మేనేజర్ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు.
60 ఏళ్లు దాటినసీనియర్ సిటిజన్లకు 0.5 శాతం వడ్డీ అధికంగా ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. ఎన్నారైలకు వెసులుబాటుగా ఉండేందుకు హౌసింగ్ రుణాల మంజూరు నిబంధనలను సరళతరం చేసినట్టు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications