వ్యవసాయానికిపెద్దపీట
న్యూఢిల్లీః పదవ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ప్రధాని వాజ్‌పేయి అధ్యక్షతన శనివారం నాడు జరుగుతున్న జాతీయాభివృద్ధి మండలి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత క్రమంగా తగ్గుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచ వాణిజ్య సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల సగటు ప్రజలపై పడుతున్న భారాన్ని తొలిగించడానికి కూడా తగిన చర్యలను ప్రణాళికలో పొందుపర్చాలని చంద్రబాబుకోరారు. రైతులు, పేదప్రజలను ఆదుకోవల్సి అవసరం వున్నదని ఆయన అన్నారు. రాష్ట్రాలకు మరిన్ని నిధులను సమకూర్చడానికివీలుగా నిధుల వికేంద్రీకరణకు చర్యలు తీసుకోవల్సిన అవసరం వున్నదని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ బిమల్‌జలాన్‌ను ముఖ్యమంత్రి కలుసుకుని కృషి బ్యాంకు వ్యవహారంపై చర్చ జరిపారు. ఆర్ధిక మంత్రి యశ్వంత్‌సిన్హాను కలుసుకుని కూడా చర్చలు జరిపారు.












Click it and Unblock the Notifications