ఆంధ్రకు నిధులిచ్చి ఆదుకోండిః బాబు
న్యూఢిల్లీః కరవుతో అల్లాడుతున్నా ఆంధ్రప్రదేశ్ కు తక్షణం నిధులుఅందజేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హానుకోరారు. ప్రణాళికా సంఘం సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన చంద్రబాబు యశ్వంత్ సిన్హాతో పాటు పలువురు ఇతర శాఖలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులను కలుసుకున్నారు. 480 మండలాల్లో కరవు నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రపంచబ్యాంక్ నుంచి రావలసిన 2200 కోట్ల రూపాయల విడుదలకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా చంద్రబాబు యశ్వంత్ సిన్హానుకోరారు.
కాకినాడ,విశాఖ ఎక్స్ పోర్ట్ జోన్ లలో ఎగుమతి దిగుమతి పరిశ్రమలు స్థాపించే వారికి రాయితీలు ఇచ్చేవిషయాన్ని చంద్రబాబు బృందం కేంద్ర మంత్రితో చర్చించింది. అదే విధంగా హార్డ్ వేర్ సంస్థలకు కస్టమ్స్ సుంకం నుంచిమినహాయింపు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. సుంకేశుల ప్రాజెక్టుకు సత్వరం మంజూరి ఇవ్వాల్సిందిగా చంద్రబాబువిజ్ఞప్తి చేశారు. యశ్వంత్ సిన్హాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలుసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేసేందుకు సహకరించాల్సిందిగా చంద్రబాబువిజ్ఞాపనలు అందజేశారు.












Click it and Unblock the Notifications