ఇన్నింగ్స్ ఓటమి దిశగా భారత్
కొలంబోః శ్రీలంకతో జరుగుతున్న మూడోటెస్ట్ లో భారత్ ఇన్నింగ్స్ పరాజయం దిశగా పయనిస్తున్నది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 6వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. ఇంకా ఒక రోజు ఆటమిగిలి వుండగా భారత్ ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఇంకా 159 పరుగులు చేయాల్సి వుంది.టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అంతా అవుటవ్వడంతో ఈ లక్ష్యాన్ని సాధించడం భారత్ కు అసాధ్యంగానే కనిపిస్తున్నది.
భారత్ ఓపెనర్లు దాస్ 68, రమేష్ 55 పరుగులు చేసి మంచి ప్రారంభాన్నిఅందించారు. అయితే దురదృష్ట వశాత్తు ద్రావిడ్ రనౌట్ అయ్యాడు.అప్పటి నుంచి భారత్ ఆటగాళ్ళపై వత్తిడి పెరిగిపోయింది.కైప్ కూడా రనౌట్ కాగా, గంగూలీ 124 బంతులు ఆడు 36 పరుగులకుపెవిలియన్ దారి పట్టాడు. బహుతులే కూడా అవుటవ్వడంతో బదాని, సమీర్ డిఘే క్రీజ్ లో వున్నాడు. భారత్ ఆటగాళ్ళపై శ్రీలంక బౌలర్లు మొదటి నుంచి ఆధిక్యం ప్రదర్శించారు. ఇన్నింగ్స్ రన్ రేట్ 2 కూడా లేదంటే భారత్ బ్యాట్స్ మెన్ ఎంత ధాటిగా లంక బౌలర్లను ఎదుర్కొన్నారోఅర్థం చేసుకోవచ్చు. ఏదో అద్భుతం జరిగితే తప్ప గంగూలీ బృందానికి లంక చేతిలో ఇన్నింగ్స్ ఓటమి తప్పక పోవచ్చు.












Click it and Unblock the Notifications