అలిగిన ద్రోణంరాజు రాజీనామా
విశాఖ : ఉత్తరాంధ్రాసీనాయర్ కాంగ్రెస్ నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ పిసిసి కార్యవర్గ సభ్యుడి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌సీనియర్ నాయకుడైన తనను రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గంలో కేవలం కార్యవర్గ సభ్యునిగా మాత్రమే నియమించినందకు నిరసనగా తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్టు ఆయన శనివారం నాడువిశాఖలో తెలిపారు.
పదకొండుసంవత్సరాల పాటు పి.సి.సి ఉపాధ్యక్షునిగా, అధికారప్రతినిధిగా పార్టీకి సేవలందించిన తననుప్రస్తుత కార్యవర్గంలో కేవలం కార్యవర్గ సభ్యునిగానిమయించటం తనకు మనస్ధాపం కలిగించిందనిఆయన అన్నారు. పార్టీకి పదవికి రాజీనామా చేసినప్పటికీ,సాధారణ కార్యకర్తగా తాను పార్టీకి సేవలందిస్తాననిఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications