తెహల్కాపై ప్రభుత్వం దుష్ప్రచారం
న్యూఢిల్లీః స్టాక్ మార్కెట్ కుంభకోణానికి తెహల్కా టేపుల ఉదంతమే కారణమని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పచ్చి అబద్దమని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
తెహల్కా వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న వెంకటస్వామి కమిషన్‌ను తప్పుదారి పట్టించడానికే ప్రభుత్వం ఈరకమైన ప్రచారం ప్రభుత్వం ప్రారంభించిందని కాంగ్రెస్ ప్రతినిధి జయపాల్‌రెడ్డి శనివారం నాడువిమర్శించారు.
తెహల్కా ఉదంతంబయటపడటానికి కొన్ని వారాల ముందే స్టాక్ మార్కెట్‌లోసంక్షోభం ప్రారంభమైందని ఆయన అన్నారు. స్టాక్ మార్కెట్ కుంభకోణానికి సంబంధించి ప్రభుత్వం దోషులను వెనకేసుకురావడానికి ప్రయత్నం చేయవద్దని ఆయన అన్నారు. దోషులను శిక్షించడానికి చర్యలు తీసుకోవల్సిన ప్రభుత్వం తానే నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications