ఏలూరు గుండెల్లోపేలుళ్ళు!
ఏలూరుః ఏలూరురైల్వే స్టేషన్ లో మంగళవారం అర్థరాత్రి జరిగిన బాంబు పేలుడు సంచలనం సృష్టించింది. ఫలక్ నుమాఎక్స్ ప్రెస్ ఏలూరు రైల్వే స్టేషన్ లో ఆగిన వెంటనేరైలు చివరి బోగీ పక్కన బాంబు పేలి ముగ్గురు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు.
పేలుడు జరిగిన పద్ధతి, అక్కడ లభ్యమైన తూటాలు,సెల్ ఫోన్లు, నగదును పరిశీలించిన పోలీసులు ఇందులో నక్సలైట్ల హస్తం వుండి వుంటుందనిఅంచనా వేస్తున్నారు. మరణించిన ముగ్గురిలో ఇప్పటి వరకు రెండు మృత దేహాలను గుర్తించారు. వారిలో ఒకరు ఏలూరుకే చెందిన రాంబాబు అనే ప్రయాణికుడు కాగా మరొకరు కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించారు. మూడో వ్యక్తివివరాల కోసం ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రమంతటా సంచలనం సృష్టించిన ఈ కేసును అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారికోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన వెనుక తీవ్రవాదుల హస్తం వున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాల వద్ద లభించిన రెండుసెల్ ఫోన్లలోని నెంబర్ల ఆధారంగా మరిన్ని వివరాలుసేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
- ఏలూరురైల్వే స్టేషన్‌లో పేలుళ్లు












Click it and Unblock the Notifications