క్రమశిక్షణాలోపంపై పిసిసిసీరియస్
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో క్రమశిక్షణ లోపిస్తుండడంపై పార్టీ నాయకత్వం తీవ్ర ఆందోళనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చిన్న చిన్నవిషయాలకు కూడా తగాదాలకు, ఘర్షణలకు దిగడం, పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో వీధులకెక్కడం మంచి పద్ధతి కాదని స్పష్టం చేసింది. క్రమశిక్షణను ఉల్లంఘించేవారిపై ఎటువంటి చర్యకైనా తన మద్దతు, అండదండలు వుంటాయని సోనియాగాంధీ హామీ ఇచ్చినట్లు పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావు చెప్పారు. ఈ విషయంలో అధిష్ఠానం తనకు పూర్తిస్వేచ్ఛ ఇచ్చిందని ఆయన పిసిసి కార్యవర్గ సమావేశంలో చెప్పారు.
గాంధీభవన్‌లో మంగళవారం జరిగిన పిసిసి కార్యవర్గ సమావేశంలోఎం. సత్యనారాయణరావు, సిఎల్‌పి నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి క్రమశిక్షణ అవసరాన్ని నొక్కి చెప్తూ మాట్లాడారు.
మొత్తం 13 అంశాలపై పిసిసి కార్యవర్గం తీర్మానాలు ఆమోదించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదనకు ఆమోదం తెలియజేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించాలని కొందరు నాయకులుకోరారు.












Click it and Unblock the Notifications