వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప.గో.జి.కి అక్షరాస్యలో జాతీయ అవార్డు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్‌ లో అత్యధికంగా 90 శాతం అక్షరాస్యతను సాధించిన పశ్చిమ గోదావరి జిల్లా జాతీయ అవార్డుఅందుకుంది. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ పునం మాలకొండయ్య శనివారం ప్రధాని వాజ్‌పేయి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. 50 వేల మంది వాలంటీర్లు అహోరాత్రులు శ్రమించిన కారణంగానే ఈ లక్ష్యాన్ని సాధించగలిగామని పూనం మాలకొండయ్య ఈ సందర్భంగా చెప్పారు.

అంతర్జాతీయఅక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లాఅక్షరాస్యతా సాధనలో చేసిన కృషిని ప్రశంసించారు. జిల్లాలో ఓపెన్‌ బేసిక్‌ ఎడ్యుకేషన్‌ పధకాన్ని అమలు చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ప్రభుత్వం, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ వ్యక్తిగతంగా తీసుకున్న శ్రద్ధ కారణంగా ఈ జిల్లా 90 శాతం అక్షరాస్యత సాధించింది. రాష్ట్రంలో అత్యధిక శాతం అక్షరాస్యత సాధించిన జిల్లాగా రూపుదిద్దడానికి ఎంతో శ్రమించనట్లు పూనం మాలకొండయ్యవివరించారు. ప్రభుత్వ సహకారంతో జిల్లాలో సంపూర్ణఅక్షరాస్య సాధిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X