‘ధురంధర్2’ 50 రోజుల కలెక్షన్లు.. మన సినిమా సేఫ్
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు ఆదిత్య ధర్ అద్భుత దృశ్యకావ్యంగా మలిచిన 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. భారతీయ సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, తాజాగా 50 రోజుల మైలురాయిని చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టినా థియేటర్ల వద్ద ప్రేక్షకుల ఆదరణ తగ్గకపోవడం ఈ సినిమా సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. 50వ రోజున కూడా ఈ చిత్రం సుమారు రూ.50 లక్షల నెట్ వసూళ్లను సాధించి, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
రూ.1791 కోట్లకు చేరుకుంది
ఈ చిత్రం ఇండియాలో కేవలం 50 రోజుల్లోనే రూ.1,140.67 కోట్ల నికర వసూళ్లను సాధించి అజేయంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దీని గ్రాస్ వసూళ్లు రూ.1,791.55 కోట్లకు చేరుకున్నాయి. దాదాపు రూ.225 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, పెట్టుబడిపై 406 శాతానికి పైగా లాభాలను ఆర్జించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఖర్చులు పోను కేవలం భారతదేశం నుంచే సుమారు రూ.915 కోట్ల మేర నికర లాభం రావడం గమనార్హం. అయితే బాహుబలి2 రికార్డులను మాత్రం బద్దలు కొట్టలేకపోయింది. ఈ సినిమా రూ.1830 నుంచి రూ.1870 కోట్లు లేదా రూ.2వేల కోట్లకు చేరువలో ఉందని నివేదికలు చెబుతుంటాయి.

ఓటీటీలో నిడివి తగ్గించారు
ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి ఉద్దండులు నటించడంతో సినిమాకు గ్లోబల్ అప్పీల్ లభించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంకా థియేటర్లలో విజయవంతంగా ఆడుతున్నందున మే రెండో లేదా మూడో వారంలో 'జియో హాట్‌స్టార్'లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. సుదీర్ఘ నిడివితో కూడిన ఎక్స్‌టెండెడ్ వెర్షన్ ఓటీటీలో అందుబాటులోకి రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. మే 14 లేదా మే 15వ తేదీ రాత్రి నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. సాధారణంగా థియేటర్లలో ఈ సినిమా 4 గంటలకు పైగానే ఉంది. అయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పట్టారు. అన్ని గంటలు ఎక్కడా బోర్ కొట్టకుండా చిత్రీకరించడం ఆదిత్యధర్ గొప్పతనాన్ని తెలియజేస్తోంది.












Click it and Unblock the Notifications