TVK Vijay: రేపే విజయ్‌‌ ప్రమాణస్వీకారం.. ఉదయం 10 గంటలకు ముహూర్తం

తమిళనాడులో గత కొద్ది రోజులుగా ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభనకు తెర పడింది. టీవీకే అధినేత విజయ్ కు సీఎంగా లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఆదివారం ప్రమాణస్వీకారానికి విజయ్ సిద్ధం అవుతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు రేపు ప్రమాణం చేయనున్నట్లు సమాచారం.

ఇక విజయ్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. టీవీకేకు మద్దతుగా కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీలు, వీసీకే, ఐయూఎంఎల్ నిలవడంతో విజయ్​ బలం 120 కు చేరింది. దాంతో తమిళనాట టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దీంతో టీవీకే శ్రేణులు పార్టీ కార్యాలయం వద్ద టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తో టీవీకే విజయ్ భేటీ అయ్యారు. తనకు మద్దతిచ్చిన పార్టీల లేఖలను గవర్నర్ కు అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కోరారు. గవర్నర్ వెంటనే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఓకే చెప్పారు.

Vijay Oath as Tamil Nadu CM Tomorrow at 10 00 AMHistoric Moment for Thalapathy and TVK Party Vijay

విజయ్ ప్రమాణస్వీకారానికి పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. దాంతో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక ఇటీవల వెల్లడైన తమిళనాడు అసెంబ్లీ ఫలితాల్లో టీవీకే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 108 స్థానాల్లో గెలుపొంది రాష్ట్రంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాగా విజయ్ రెండు స్థానాల్లో గెలిచిన నేపథ్యంలో ఒక స్థానానికి కచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. దాంతో టీవీకే బలం 107కు మాత్రమే పరిమితం అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్​ ఫిగర్​ 118కు 10 సీట్ల దూరంలో ఆగిపోయింది. అయితే తాజాగా ఐదు పార్టీలు విజయ్ కు మద్దతు తెలిపిన నేపథ్యంలో విజయ్ సీఎం సీటుకు మార్గం సుగమమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+