విజయ్ సీఎం అవుతున్న వేళ స్టాలిన్ మాస్ట్రర్ స్ట్రోక్..! రాజకీయాల్లో తొలిసారి..!

తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ ఏర్పాటు చేయబోతున్న కొత్త ప్రభుత్వానికి మద్దతివ్వాలని ఇవాళ డీఎంకే కూటమిలోని రెండు చిన్న పార్టీలు వీసీకే, ఐయూఎంఎల్ (VCK and IUML) నిర్ణయించాయి. వీరిద్దరికీ కలిపి నాలుగు సీట్లు ఉండటంతో అప్పటికే 116 సీట్లు కలిగిన టీవీకే-కాంగ్రెస్-కమ్యూనిస్టుల కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. విజయ్ ప్రభుత్వానికి మద్దతివ్వాలని ఇవాళ నిర్ణయించిన రెండు పార్టీలు వీసీకే, ఐయూఎంల్ .. తాము డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని స్పష్టం చేశాయి.

విజయ్ కు డబుల్ బొనాంజా.. ! అంతా స్టాలిన్ స్క్రిప్టేనా ?
విజయ్ కు డబుల్ బొనాంజా.. ! అంతా స్టాలిన్ స్క్రిప్టేనా ?

సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా, కేంద్రంలో అయినా ఓ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతిస్తున్న పార్టీలు అదే కూటమిలో ఉంటాయి. కానీ తమిళనాడులో మాత్రం విచిత్రంగా విజయ్ పార్టీ టీవీకేకు మద్దతిస్తున్న వీసీకే, ఐయూఎంఎల్ లు ఇంకా డీఎంకే కూటమిలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశాయి. అంతే కాదు ప్రభుత్వానికి బయటి నుంచే మద్దతివ్వాలని నిర్ణయించాయి. ప్రస్తుతానికి బేషరతుగా మద్దతిస్తున్నట్లు ప్రకటించినా.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నాయి. దీన్ని బట్టి ఇదంతా డీఎంకే అధినేత స్టాలిన్ ఆడిస్తున్న ఆటగానే కనిపిస్తోంది.

VCK and IUML Pull Off a Political Masterstroke Stay in DMK Alliance While Backing Vijay s New Government
నాలుగోసారి గవర్నర్ వద్దకు విజయ్-ఈసారి 120 సీట్లతో..!
నాలుగోసారి గవర్నర్ వద్దకు విజయ్-ఈసారి 120 సీట్లతో..!

ఇదంతా చూస్తుంటే విజయ్ ఏర్పాటు చేయబోయే కొత్త ప్రభుత్వం దినదినగండంగానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం సుస్దిరంగా ఉండాలంటే దానికి మద్దతిచ్చే పార్టీలు సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాన పార్టీ ఉండే కూటమిలోనే ఉండాలి. కానీ అందుకు విరుద్దంగా వీసీకే, ఐయూఎంఎల్ తీరు ఉంది. అదే సమయంలో విజయ్ కు కేవలం సాధారణ మెజార్టీ కంటే రెండు సీట్లు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ రెండు పార్టీల్లో ఒక్కటి భవిష్యత్తులో ప్లేటు ఫిరాయించినా విజయ్ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొని గెలవడం లేదా కుప్పకూలడం జరగక తప్పదు. మరోవైపు కమ్యూనిస్టులు మాత్రం బయటి నుంచే విజయ్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నాయి. అయితే డీఎంకే కూటమిలో కొనసాగుతున్నట్లు మాత్రం ఎక్కడా చెప్పలేదు.

విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై స్టాలిన్ ట్వీట్..! అసెంబ్లీలో ఇక..!
విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై స్టాలిన్ ట్వీట్..! అసెంబ్లీలో ఇక..!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+