నాలుగోసారి గవర్నర్ వద్దకు విజయ్-ఈసారి 120 సీట్లతో..!
తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించినా గవర్నర్ కరుణ లేక ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్న టీవీకే అధినేత విజయ్(Vijay).. ఇవాళ మరోసారి ఆయన్ను కలిశారు. ఇప్పటికే మూడుసార్లు గవర్నర్ వద్దకు వెళ్లి మెజార్టీ నిరూపించుకోలేక వెనుదిరిగిన విజయ్ కు ఇవాళ చోటు చేసుకున్న పరిణామాలు కలిసొచ్చాయి. డీఎంకే మిత్రపక్షాలైన వీసీకే, ఐయూఎంల్ విజయ్ పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మెజార్టీ లభించింది.
మూడోసారి విజయ్ గవర్నర్ ను కలిసిన సందర్భంలో 120 సీట్ల మెజార్టీ ఉన్నట్లు చూపించారు. అయితే అందులో ఏఎంఎంకే పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఓ ఎమ్మెల్యే తగ్గారు. అలాగే వీసీకే, ఐయూఎంఎల్ కూడా మద్దతు లేఖలు ఇవ్వకపోవడంతో ఈ సంఖ్య కాస్తా 116కు పడిపోయింది. దీంతో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అవసరమయ్యారు. ఈ నేపథ్యంలో 2 సీట్లు కలిగిన వీసీకే ఇవాళ సాయంత్రం వరకూ ఊరించి చివరకు బేషరతుగా మద్దతిచ్చింది. అనంతరం మరో 2 సీట్లున్న ఐయూఎంఎల్ కూడా మద్దతు లేఖ ఇచ్చింది. దీంతో విజయ్ కు 120 సీట్ల మెజార్టీ లభించింది.

ఇప్పుడు విజయ్ కూటమిలో టీవీకేకు చెందిన 107 మంది ఎమ్మెల్యేేలతో పాటు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ కు చెందిన తలో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విజయ్ మరో సీటు కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 121 అవుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు మాత్రమే అవసరం ఉండటంతో దాదాపు సాధారణ మెజార్టీతోనే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.













Click it and Unblock the Notifications