Bandi Sanjay: బండి సంజయ్ కు బిగ్ షాక్..! మోడీ టూర్ నుంచి అవుట్..!
కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)కు ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ వేళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోడీ టూర్ కు ఆహ్వానితుల జాబితాలో నుంచి బండి సంజయ్ పేరును తొలగించారు. కాంగ్రెస్ కు చెందిన ఎంపీలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరవుతున్న ప్రధాని మోడీ కార్యక్రమంలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు. దీంతో తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడికి పెద్ద షాక్ గా మారింది.
ఆదివారం ప్రధాని మోడీ తెలంగాణ టూర్ కు వస్తున్నారు. హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందించింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.

అయితే దీనిపై బీజేపీ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. కానీ ఇవాళ బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఓ మైనర్ బాలికను వేధించిన వ్యవహారం తెరపైకి రావడం, పోక్సో కేసు నమోదు చేయాలనే డిమాండ్లు, అదే సమయంలో అతనిపై హనీ ట్రాప్ జరిగినట్లు బీజేపీ వర్గాలు చెప్పడం వంటి కారణాల నేపథ్యంలో ఎందుకైనా మంచిదని ప్రధాని టూర్ కు దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై మాత్రం ఆయన సన్నిహితులు, అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.














Click it and Unblock the Notifications